అందుకే డబ్‌ చేశాం

20 Nov, 2022 04:33 IST|Sakshi
దిల్‌ రాజు, అనిల్, రాధిక, రవీనా, ఇవానా, ప్రదీప్‌

– దిల్‌ రాజు

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్‌ టుడే’. ఇవాన హీరోయిన్‌గా, రవీనా కీలక పాత్రలో నటించారు. ఈ నెల 4న తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాను అదే టైటిల్‌తో ‘దిల్‌’ రాజు తెలుగులో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా జరిగిన ‘లవ్‌ టుడే’ ఆడియో, ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి, నటి రాధికా శరత్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా విడుదలైన ‘లవ్‌ టుడే’ యాభై కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. తమిళ ట్రైలర్‌ చూసి రీమేక్‌ ఆలోచన వచ్చింది. కానీ మ్యాజిక్‌ మిస్సవుతుందేమోనని తెలుగులో డబ్‌ చేశాం’’ అన్నారు. ‘‘తమిళంలోలానే ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు ప్రదీప్‌.

మరిన్ని వార్తలు