Dil Raju Trending : ట్విట్టర్‌లో తెగ ట్రెండ్‌ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!

12 Aug, 2022 17:06 IST|Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పేరు ఇప్పుడు ట్విట్టర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. 'దిల్‌రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. ఉన్నట్లుండి దిల్‌రాజు పేరు నెట్టింట పేరు వైరల్‌ కావడానికి కారణమేమిటి? తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌8న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట​్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఒకే ఒక్క పోస్టర్‌ని మూవీ టీం రిలీజ్‌ చేసింది. షూటింగ్‌ ప్రారంభించి ఏడాది కావొస్తున్నా RC15 నుంచి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

దీంతో ట్విట్టర్‌ వేదికగా మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దిల్‌రాజును ట్యాగ్‌ చేస్తూ అప్‌డేట్స్‌ ఇవ్వాలని ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో దిల్‌రాజు పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

>
మరిన్ని వార్తలు