సీఎం ఫండ్‌కు నిర్మాత రూ.10 లక్షల విరాళం

17 Jun, 2021 08:56 IST|Sakshi

ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కరోనా నివారణ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. బుధవారం ఉదయం ఆయన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలసి చెక్కు అందించారు. తన వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు కలైపులి చెప్పారు.  చెక్‌తో పాటు సీఎంను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని జోడించారు. కరోనా కాలంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేశారని, వేగవంతమైన చర్యలు, వివేకమంతమైన నిర్ణయాలు, అవిశ్రాంతి కార్యాచరణలు దేశాన్ని తిరిగి చూసేలా చేస్తున్నాయని కొనియాడారు.

చ‌ద‌వండి: నిర్మాత హత్యకు కుట్ర! రౌడీ షీటర్‌ అరెస్ట్‌

లాక్‌డౌన్‌ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే..

మరిన్ని వార్తలు