ప్రముఖ నిర్మాత కొడాలి వెంకటేశ్వరావు సతీమణి కన్నుమూత

4 May, 2021 18:01 IST|Sakshi

కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. కొందరు కరోనాకు బలైపోతుంటే.. మరికొందరూ ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. తాజా టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం(మే 4) కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిత ఈ రోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి అనిత సైతం కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక వీరి కుమార్తె స్వాతి జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు