Project K: ‘ప్రాజెక్ట్ కె’ లో కీలక మార్పు.. చివరి నిమిషంలో సంచలన నిర్ణయం!

26 Feb, 2023 09:36 IST|Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కీలక మార్పులు  చేశారు మేకర్స్‌. ఈ సినిమా సంగీత దర్శకుడిని మార్చేశారు. తొలుత ‘ప్రాజెక్ట్‌ కె’ అనౌన్స్‌ చేసినప్పుడు మిక్కీ జె మేయర్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్‌ నారాయణన్‌ వచ్చి చేరారు. 

ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ మార్పుకు గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తకిర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ మూవీ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్ అయినా.. ఎమోషన్స్‌, సెంటిమెంట్‌ అన్ని ఉంటాయని అన్నారు. దాదాపు 70 శాతం షూటింగ్‌ పూర్తయినట్ల ఆయన వెల్లడించారు. ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్‌లకు స్క్రీన్‌ స్పెస్‌ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఐదారు కంపెనీలు చేస్తున్నాయని.. వాటిని తెరపై చూసినప్పుడు అద్భుతంగా ఉంటుందని అన్నారు.

ఇక సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ విషయానికొస్తే.. తమిళంలో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన పని చేసే చిత్రాలలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. తెలుగు ప్రస్తుతం నాని ‘దసరా’, వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు