సినిమా చూసి నవ్వకపోతే టికెట్‌ డబ్బులు ఇచ్చేస్తాం: నిర్మాత

27 Sep, 2023 15:32 IST|Sakshi

వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. సూర్యదేవర నాగవంశీ ముందుడి మరీ ఈ నిర్మాణ సంస్థను నడిపిస్తున్నాడు. ఇప్పటికే పలు వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అదించిన ఈ నిర్మాణ సంస్థ..తాజాగా ‘మ్యాడ్‌’తో అలరించడానికి సిద్ధమైంది. ఎన్టీఆర్ బామ్మర్థి నార్నే నితిన్,  శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌  6న ఈ  చిత్రం విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. జాతి రత్నాలు సినిమా కంటె ఎక్కువగా ఈ చిత్రం నవ్విస్తుందన్నారు.  జాతి రత్నాలు కంటే తక్కువగా ఈ సినిమా నవ్వించింది అని ప్రేక్షకులు ఫీల్ అయితే కచ్చితంగా వారి టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తాను అంటూ నిర్మాత ఛాలెంజ్ చేశాడు.

‘సినిమా మీద నమ్మకంతో ఈ ఛాలెంజ్‌ చేస్తున్నాను. ఇది యూత్‌ఫుల్‌ సినిమా అయినప్పటికీ..కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది’ అని నాగవంశీ అన్నారు. 

మరిన్ని వార్తలు