రామ్‌గోపాల్‌ వర్మ వల్ల ఆ సినిమాను వదిలేశారు: నిర్మాత

6 May, 2021 08:43 IST|Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ స్పీచ్‌ వల్ల డబ్బులు పోగొట్టుకున్నానంటున్నాడు ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ. సుమారు 200కు పైగా చిత్రాలు నిర్మించిన ఆయన అప్పట్లో ఆర్జీవీతో ఐస్‌క్రీమ్‌ తీసి నష్టపోయానని చెప్తున్నాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "2004లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, 2014లో రామ్‌గోపాల్‌ వర్మతో ఐస్‌క్రీమ్‌ సినిమా తీశాను. అప్పట్లో శాటిలైట్‌ హక్కులు జెమిని టీవీ వాళ్లు కొనేవారు. అలా ఈ సినిమాను కోటి 20 లక్షల రూపాయలకు కొన్నారు. కానీ రామ్‌గోపాల్‌ వర్మ నోరు జారుతూ ఈ సినిమాకు రూ.2. 5 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టారని చెప్పాడు"

"దీంతో అనవసరంగా ఈ సినిమాను ఎక్కువ మొత్తానికి కొన్నామా? అన్న ఆలోచనలో పడ్డ జెమిని యాజమాన్యం వారి డీల్‌ను రద్దు చేసుకున్నారు. నిజానికి ఆర్జీవీ.. రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో సినిమా ప్రారంభించాం. హీరోయిన్లు, టెక్నీషియన్లు అందరం సినిమా సక్సెస్‌ అయ్యాక డబ్బులు తీసుకున్నాం అని చెప్పాడు. కానీ వాళ్లదంతా వినలేదు. కేవలం ఆ పెట్టుబడి గురించి మాత్రమే విని సినిమా వదిలేశారు" అని రామ సత్యనారాయణ చెప్పుకొచ్చాడు.

చదవండి: కరోనాతో తమిళ నిర్మాత మృతి

మరిన్ని వార్తలు