భార్యకు కాస్ట్‌లీ కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత రవీందర్‌, ధరెంతంటే!

1 Nov, 2022 14:57 IST|Sakshi

ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లితో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారరు. రెండు నెలల క్రితం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో, వార్తల్లోకెక్కారు. తాము ఒక్కటయ్యామంటూ ఫొటోలు షేర్‌ చేయడంతో వీరిని ట్రోల్స్‌ ఆటాడుకున్నారు నెటిజన్లు. దీనికి కారణం నిర్మాత రవిందర్‌ అధిక బరువు. కేవలం డబ్బు కోసమే రవిందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందని ఈ జంటను టార్గెట్‌ చేశారు.

చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్‌ కూతురు

అయితే ఈవేవి పట్టించుకుని ఈ జంట తమ దాంపత్యాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా భార్యకు కాస్ట్‌లీ కారు బాహుమతిగా ఇచ్చి తనపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు నిర్మాత రవీందర్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. మనం ప్రేమించే వ్యక్తి.. తిరిగి మనల్ని అంతే గొప్పగా ప్రేమిస్తే అది మరింత విశేషం. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త కారు.. ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారును మనం పొందగలమని కోరుకుంటున్నాను’ అంటూ తమిళంలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా భార్యతో కలిసి షో రూం దగ్గర కారు కొంటున్న వీడియోను షేర్‌ చేశాడు.

చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి

నిర్మాత రవీందర్‌ తన భార్య మహాలక్ష్మికి ఇచ్చిన ఈ కారు ధర ఆసక్తిగా మారింది. బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్‌ గ్యారేజీ కారుని భార్యకు ఆయన గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ. 32 లక్షల వరకు ఉంటుందని అంచనా. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. నటి మహాలక్ష్మికి గతంలో అనిల్ నేరేడిమిలితో వివాహం జరిగగా వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మహాలక్ష్మి 2019లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కుమారుడితో ఒంటరి నివసిస్తున్న ఆమె ఈ క్రమంలో రవీందర్‌ చంద్రశేఖరన్‌తో ప్రేమలో పడింది. సెప్టెంబర్‌ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official)

A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official)

A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran)

మరిన్ని వార్తలు