Enna Solla Pogirai Movie: 'ఎన్న సొల్ల పొగిరాయి' చిత్రంపై నిర్మాత ఏమన్నారంటే..?

7 Dec, 2021 09:42 IST|Sakshi

చైన్నై సినిమా: 'ఎన్న సొల్ల పోగిరాయ్‌' చిత్రం యువత పండుగ చేసుకునే విధంగా ఉంటుందని నిర్మాత ఆర్‌. రవీంద్రన్‌  పేర్కొన్నారు. తన ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కుక్‌ విత్‌ కోమలి' ఫేమ్‌ అశ్విన్‌ కుమార్‌ లక్ష్మి కాంతన్‌ కథానాయకుడిగా, అవంతిక, తేజస్విని నాయికలుగా నటించారు. హరిహరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిచర్డ్‌ ఛాయాగ్రహణను, వివేక్, మెర్లిన్‌ సంగీతాన్ని అందించారు. ఈనెల 24వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం చెన్నైలో నిర్వహించారు. నిర్మాత ఆర్‌. రవీంద్రన్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పూర్తిగా కొత్తవారిని పరిచయం చేసినట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు అశ్విన్‌ కుమార్‌ లక్ష్మీ కాంతన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు