‘బట్టల రామస్వామి’కి హిట్‌ టాక్‌ రావడం హ్యాపీ: నిర్మాత

14 May, 2021 20:30 IST|Sakshi

‘‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రానికి హిట్‌ టాక్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా ‘జీ 5’ ఓటీటీలో రిలీజ్‌ అయ్యిందంటే ముఖ్య కారణం మ్యాంగో టీవీ రామ్‌గారు. ఆయనకి థ్యాంక్స్‌’’ అని నిర్మాత సతీష్‌ కుమార్‌ ఐ అన్నారు. అల్తాఫ్‌ హాసన్, శాంతీ రావు, సాత్విక్‌ జైన్, లావణ్యా రెడ్డి, భద్రం, ధన్‌రాజ్‌ ముఖ్య పాత్రల్లో రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్‌ కుమార్‌.ఐ, రామ్‌ వీరపనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘సినిమాలపై మక్కువతో కోడి రామకృష్ణ దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశాను. సెవెన్‌ హిల్స్‌ పేరు మీద బిజినెస్‌ స్టార్ట్‌ చేశాను. రామోజీ రావు, రామానాయుడు, దాసరి నారాయణ రావు, ‘దిల్‌’ రాజు గార్ల స్ఫూర్తితో నిర్మాతగా మారాను. మా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఆ సినిమాకి నా భార్య వీణాదరి సహ నిర్మాతగా వ్యహరించింది. ఈ సినిమాకి రాజేంద్ర ప్రసాద్‌గారి లాంటి సీనియర్‌ ఆర్టిస్టులని తీసుకోవచ్చుగా అన్నారు. కథా బలం ఉన్న సినిమా కావడంతో కొత్తవారికి అవకాశం కల్పించాను. సెవెన్‌ హిల్స్‌ బ్యానర్‌లో ‘బ్యాక్‌ డోర్‌’ సినిమాని సమర్పిస్తున్నాం. పాయల్‌ రాజ్‌పుత్‌తో ఉగాదిన కొత్త సినిమా స్టార్ట్‌ చేశాం’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు