తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత సురేశ్‌ బాబు సంచలన వ్యాఖ్యలు

10 Dec, 2022 15:56 IST|Sakshi

గత కొంతకాలంగా టాలీవుడ్‌లో తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయం చిన్న వివాదం జరుగుతుంది. సంక్రాంతి సీజన్‌లో  తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా నిర్మాతల మండలి నిర్ణయంపై  ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సంక్రాంతి సీజన్‌లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు.

‘తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడట్లేదు. చెన్నైలో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లోకల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారు. సినిమా బాలేకుంటే తరువాతి రోజే తీసేస్తారు. ఇదొక బిజినెస్‌ అంతే. ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్‌ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో విడుదలయి విజయం సాధిస్తున్నాయి.

మరిన్ని వార్తలు