డాక్టర్ సాబ్‌ టైటిల్‌ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్‌ కొండేటి

2 Jul, 2021 19:31 IST|Sakshi

ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్‌లో శోభన్ హీరోగా డీఎస్‌బీ దర్శకత్వంలో ఎస్‌పీ నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ సాబ్. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ సంగీతం అందిస్తుండగా ఎన్. ప్రభాకర్ రావు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1400 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన విక్కీ మాస్టర్ ఈ సినిమాకు సమర్ఫిస్తుండటం విశేషం. కాగా శుక్రవారం ఈ సినిమాకు సంబందించిన టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవని మరువలేం. వారు నిజమైన దేవుళ్ళు. అలాంటి డాక్టర్స్‌లో ఒకరు శోభన్. అయన హీరోగా నిర్మాతగా చేస్తున్న సినిమా డాక్టర్ సాబ్‌. ఈ మూవీ లోగోని నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు విక్కీ మాస్టర్ ఈ సినిమాను సమర్పిస్తుండం సినిమాపై అంచనాలను పెంచుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మూవీ యూనిట్‌కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విక్కీ మాస్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ సాబ్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన నా మిత్రుడు సురేష్‌కు ధన్యవాదాలు. తన శిష్యులైనా శోభన్, సురేష్‌లు ఈ చిత్రానికి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రాశాన్నారు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆయన అన్నారు. 

అలాగే దర్శకుడు డీఎస్‌బీ మాట్లాడుతూ.. ఎంతో  కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. తనను నమ్మి ఈ సినిమాని తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాత, హీరో శోభన్ కృతజ్ఞతలు తెలిపారు. మా కోరికను మన్నించి ఈ సినిమా టైటిట్‌ను ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందన్నారు. హీరో శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే హీరోగా చేయాలనిపించిందని అన్నాడు. ఈ సినిమా చేయడానికి కారణం విక్కీ మాస్టర్ అని, అయన సినిమాకు మొదటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నాడు. దర్శకుడు సురేష్ సహకారం బాగా ఉందని, సినిమా బాగా చేశాడని తెలిపాడు. అలాగే తమ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు