‘స్వాతిముత్యం’లో కాంట్రవర్షియల్ టాపిక్‌ని టచ్‌ చేశాం

1 Oct, 2022 17:11 IST|Sakshi

బెల్లంకొండ గణేష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌. లక్ష్మణ్‌ కె. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘స్వాతిముత్యం’ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్స్‌లో సినిమా చూశాక  నవ్వుకుంటూ బయటకు వస్తారు.  ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఇందులో టచ్ చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఫన్ టోన్ లో చెప్పాం.

► ఇప్పుడొస్తున్న కొత్త డైరెక్టర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. లక్ష్మణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా తాను అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇచ్చాం.

►  కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. మా చిత్రం కూడా  గాడ్‌ఫాడర్‌, ఘోస్ట్‌ చిత్రాలతో విడుదలవుతుంది. ఇది కొంచెం రిస్కే కానీ తప్పలేదు.   దసరా సీజన్ కాబట్టి  బరిలో రెండు పెద్ద సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం.

► గాడ్‌ఫాదర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మా సినిమా గురించి ప్రస్తావించడం ఆనందంగా ఉంది.  చిన్న సినిమాలను ఆదరించమని చిరంజీవి ఎప్పుడూ కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు.

► ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది కాబట్టి స్వాతిముత్యం టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది.

► బెల్లంకొండ సురేష్ గారు పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు గణేష్‌కు  వస్తుంది.

మరిన్ని వార్తలు