ల‌వ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఛ‌లో ప్రేమిద్దాం’

13 Nov, 2021 17:16 IST|Sakshi

`ప్రెజ‌ర్  కుక్క‌ర్‌` ఫేమ్  సాయి రోన‌క్‌,  `90 ఎమ్ ఎల్`  ఫేమ్ నేహ సోలంకి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ పతాకంపై ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌తో సహా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న  ఈ చిత్రం నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉద‌య్ కిర‌ణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను గ‌తంలో రాజీవ్ క‌న‌కాల‌తో `బ్లాక్ అండ్ వైట్`, వ‌రుణ్ సందేశ్ హీరోగా `ప్రియుడు` చిత్రాలు నిర్మించాను. ప్రియుడు సినిమా  స‌మ‌యంలో సురేష్  ప‌రిచ‌యం. ఆ స‌మ‌యంలోనే  త‌ను ఒక మంచి క‌థ చెప్పాడు . ఆ క‌థ న‌చ్చి ` ఛ‌లో ప్రేమిద్దాం` చిత్రం నిర్మించాను.  సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్ర‌జంట్ ట్రెండ్ కు క‌నెక్టయ్యే అంశాల‌తో పాటు  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా ఇది. ఇందులో మంచి ల‌వ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ పాయింట్  ఉంది.  ద‌ర్శ‌కుడు సినిమాను చాలా బాగా డీల్ చేశారు. ఇది అంద‌రికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది’ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.... ‘ఈ చిత్రంలో పంచ భూతాల్లాంటి ఐదు  పాట‌లున్నాయి.  భీమ్స్ అంటే ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ మాస్ సాంగ్స్ అనుకునే వారు. కానీ, ఈ సినిమాతో భీమ్స్ మాస్ తో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయ‌గ‌ల‌డ‌ని ప్రూవ్ చేసే విధంగా పాట‌లుంటాయి.  పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న‌ప్పుడే సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఏర్పడింది. క‌చ్చితంగా ఛ‌లో ప్రేమిద్దాం చిత్రం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది’ అన్నారు. 

మరిన్ని వార్తలు