Harnaaz Kaur Sandhu: మిస్‌ యూనివర్స్‌పై చీటింగ్‌ కేసు, నష్టపరిహారం చెల్లించాలని నిర్మాత డిమాండ్‌

5 Aug, 2022 17:43 IST|Sakshi

హర్నాజ్‌ కౌర్ సంధు 'మిస్‌ యూనివర్స్‌ 2021' కిరీటాన్ని గెలిచి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌ హీరోయిన్లు సుస్మితా సేన్‌,  లారా దత్తాల తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్‌ దేశం గర్వించేలా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఆమెపై చండీఘడ్‌ కోర్టులో కేసు నమోదైంది. హర్నాజ్‌ చీటింగ్‌ చేసిందంటూ పంజాబీ సినీ నిర్మాత ఉపాసన సింగ్‌ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హర్నాజ్‌ వల్ల తాను ఆర్థికంగా నష్ణపోయానని, తనని నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఆమె కోర్టును కోరింది.

చదవండి: మీ మాజీ భర్త షాహిద్‌ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్‌ చూశారా?

కాగా మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌కు ముందు హర్నాజ్‌ మోడల్‌గా రాణిస్తూనే పలు పంజాబీ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ఆమె 2020లో ‘భాయ్‌ జీ కుట్టంగే’ అనే మూవీకి సంతకం చేసింది. ఈ సినిమాకి కమిట్‌ అయ్యే ముందు ఆమె సంతోష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టూడియోస్‌తో ఒప్పందం కుదిర్చుంచుకుంది. దీని ప్రకారం మూవీ షూటింగ్స్‌ ప్రారంభం నుంచి విడుదలయ్యేంతవరకు టీం ఎప్పుడు పిలిచిన రావాలని, అన్ని ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా హర్నాజ్‌తో నిర్మాతల అగ్రీమెంట్‌ రాసుకున్నారు.

చదవండి: అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్‌

అయితే ఆమె మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలిచాక పూర్తిగా వారిని అవైయిడ్‌ చేసిందని, తమ కాల్స్‌కు స్పందించడం లేదని నిర్మాత ఉపాసన సింగ్‌లో పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాదు మిగతా మూవీ సిబ్బంది, సహా నటీనటుల ఫోన్స్‌ కూడా ఆన్సర్‌ చేయకుండ బాధ్యత రహితంగా వ్యవహరించిందని ఆమె తెలిపింది. హర్నాజ్‌ తీరుతో తాము ఆర్థికంగా నష్టపోయామని, తను నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేసింది. దీంతో కోర్టు ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హర్నాజ్‌ ఇప్పటికి ఈ కేసుపై స్పందించకపోవడం గమనార్హం. 
 

మరిన్ని వార్తలు