Kantara Movie: అందుకే కాంతార ఆస్కార్‌కు నామినేట్‌ కాలేదు: నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

1 Feb, 2023 15:07 IST|Sakshi

కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  దేశ​ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. హోంబలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్‌కు షాట్‌లిస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.

చదవండి: ‘మాస్టర్‌’ హీరోయిన్‌ సాక్షి శివానంద్‌ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?

ఈ నేపథ్యంలో కాంతార ఆస్కార్‌కు నామినేట్‌ కాకపోవడంపై తాజాగా ఈ మూవీ నిర్మాత, హోంబలే ఫిలిం అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయ​ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథ నేపథ్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియన్స్‌ కొత్త రకం కంటెంట్‌నే ఆదరిస్తున్నారు. అదే విధంగా ఇప్పటి ఫిలిం మేకర్స్ లక్ష్యం కూడా అదే. కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల విషయంలో అదే జరిగింది. కాంతార ద్వారా తుళు కల్చర్‌ని అంతా తెలుసుకున్నారు. ఇకపై కూడా అలాంటి కథలపైనే దృష్టి పెడుతున్నాం’ అన్నారు.

చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న బాలయ్య వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడంటే..!

ఇక కాంతార ఆస్కార్‌కు నామినేట్‌ కాకపోవడంపై మాట్లాడుతూ.. ‘కాంతార సినిమా సప్టెంబర్‌ రిలీజయింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయం లోపు ప్రచారం చేయలేకపోయాం. చాలా తక్కువ టైం ఉండటంతో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అవ్వలేదనుకుంట. ఆ లోటుని కాంతార 2 తీరుస్తుంది. ఆల్రెడీ కాంతార 2 పనులు మొదలయ్యాయి. 2024 చివరి వరకు కాంతార 2 సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు