Thalaivi Movie: ‘మొదట్లో కేసు పెట్టారు.. ఇప్పుడు ప్రశంసిస్తున్నారు’

14 Sep, 2021 08:27 IST|Sakshi

‘‘తలైవి’ని ఆరంభింనప్పుడు జయలలితగారి కుటుంబసభ్యులు కేసు వేశారు. కానీ సినిమా చూసి ‘జయలలితకు ఇంతకన్నా గొప్ప నివాళి ఎవరూ ఇవ్వలేరు’ అని ఆనంద పడ్డారు’’ అన్నారు నిర్మాత విష్ణు ఇందూరి. ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రపొందిన చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేయగా, ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌. పాత్రను అరవింద్‌ స్వామి చేశారు. విష్ణు ఇందరి నిర్మింన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది.

చదవండి: Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘‘జయలలిత పాత్రలో కంగనా అనగానే 99 శాతం మంది బ్యాడ్‌ చాయిస్‌ అన్నారు. కానీ సినిమా చూశాక వారే ఇప్పుడు గుడ్‌ అంటున్నారు. ఎం.జీ.ఆర్‌ పాత్రకు అరవింద్‌ స్వామి బాగా సరిపోయారు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ బాగా తీశారు. నెక్ట్స్‌ సోషల్‌ మీడియా మీద ‘ట్రెండింగ్‌’ అనే సినిమా ప్లాన్‌ చేశాం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌లో చిక్కుకున్నప్పుడు భారత ప్రధాని కార్యాలయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే అంశాల ఆధారంగా ఓ సినిమా అనుకుంటున్నాం. ‘ఆజాద్‌ హింద్‌’ ప్రాంఛైజీ ద్వారా స్వాతంత్య్ర సమరయోధుల కథలను చూపించాలనుకుంటున్నాం. ముందుగా వీరనారి దుర్గాభాయ్‌ బయోపిక్‌ చేయాలనున్నాం. ఇక రణ్‌వీర్‌ సింగ్‌ ‘83’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం’’ అన్నారు. 

చదవండి: ‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్‌, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’

మరిన్ని వార్తలు