తలైవి చిత్రం ఓటీటీలో విడుదలవుతుందా?

22 Apr, 2021 08:00 IST|Sakshi

'తలైవి' చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతుందనే ప్రసారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన చిత్రం తలైవి. ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్, ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటించారు. కథను బాహుబలి ఫేమ్‌ విజయేంద్ర ప్రసాద్‌ సమకూర్చారు. ఈ చిత్రాన్ని విజయ్‌ దర్శకత్వంలో లిబ్రి మోహన్‌ పిక్చర్స్‌ కర్మ మీడి యా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి.

దీన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కరోనా మళ్లీ విజృంభించడంతో తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లోనూ పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్నాయి. దీంతో తలైవి చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందని ప్రసారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ తలైవి చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తామన్నారు. అంతకుముందు చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. 

చదవండి: జయలలిత బయోపిక్స్‌: దీపకు చుక్కెదురు‌

మరిన్ని వార్తలు