Amitabh Bachhan Birthday Special: బిగ్‌ బీ బర్త్ డే స్పెషల్.. పోస్టర్ వైరల్

11 Oct, 2022 20:11 IST|Sakshi

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే కానుకగా ప్రాజెక్ట్-కె  బృందం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.  ప్రభాస్ నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌ బీ లుక్‌ను రివీల్ చేస్తూ ఆయనకు పుట్టిన రోజు  సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. బిగ్‌ బీ పిడికిలి బిగించి ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమితాబ్ ఇవాళ 80వ జన్మదినం జరుపుకుంటున్నారు. 

(చదవండి: బిగ్‌బీ అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ)

ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అమితాబ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. లెజెండ్స్​ ఎప్పటికీ అమరులుగానే ఉండిపోతారని పోస్టర్‌పై రాసుకొచ్చింది. ఈ పోస్టర్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరలవడంతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

మరిన్ని వార్తలు