P.Susheela : అయిష్టంగా పాడిన పాట ఏంటో తెలుసా?

13 Nov, 2021 10:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అద్భుత గాయని గానకోకిల సుశీల.. అంతేనా.. గాన సరస్వతి, మధుర స్వరాల మహరాణి సుశీలమ్మ. పాటకు ప్రాణం పల్లవి అయితే.. ఆ పల్లవికే ఆరో ప్రాణం మన సుశీలమ్మ. విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా తన గంధర్వ గాన మాధుర్యంతో అఖిలాండ కోటి  శ్రోతల హృదయాలను ఓలలాడించిన గాయనీమణి సుశీల. ఆమె ఈ నేలపై పుట్టడం మనకు గర్వ కారణం. తేనెలూరు ఆమె గాన ప్రతిభకు ఎన్ని పురస్కారాలు, అవార్డులిచ్చినా తక్కువే.. నవంబరు13 సుశీలమ్మ  86వ పుట్టినరోజు సందర్భంగా సాక్షి. కామ్‌ శుభాకాంక్షలందిస్తోంది. 

తెలుగు సీనీ రంగంలో 50 వేలకు పైగా పాటలు పాడి అందరినీ అలరించిన సంగీత సరస్వతి పి.సుశీల. సుదీర్ఘ తన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ భాషలలో పాడిన  పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. అందుకే గాన సరస్వతి, కన్నడ కోగిలెగా శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

సంగీతానికి పెట్టింది పేరైన విజయనగరంలో న్యాయవాది పి.ముకుందరావు, శేషావతారం దంపతులకు  1935 నవంబరు 13 జన్మించారు పులపాక సుశీల. 1950 సంత్సరంలో రేడియోలో నిర్వహించిన పోటీలో పాడిన పాట సుశీలమ్మ సంగీత ప్రస్థానానికి నాంది పలికింది. ఏ.ఎమ్.రాజాతో కలిసి తెలుగులో కన్నతల్లి అనే సినిమాలో పాటతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేశారు. అది మొదలు దశాబ్దాలు పాటు పలు భాషల్లో సినీ సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాణి ఆమె. 

 శ్రీ లక్ష్మమ్మ కథ, పెళ్ళి చేసి చూడు, పిచ్చి పుల్లయ్య, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, ముద్దుబిడ్డ, బాలనాగమ్మ, ఇల్లరికం, కృష్ణ లీలలు, మా ఇంటి మహాలక్ష్మి, శభాష్ రాముడు, భూకైలాస్, మాంగల్యబలం, ముందడుగు, సువర్ణ సుందరి, మాయా బజార్, అల్లూరి సీతారామయ్య  ఇలా  చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌ చాలా పెద్దదే. సుశీలగారు పాడనంటే పాడను అని బాధపడిన సంగతి గురిచి స్వయంగా ఆమే ఒకసారి ప్రస్తావించారు. సీనియర్‌ NTR డ్రైవర్ రాముడులో చక్రవర్తి సంగీతంలో "గ్గుగ్గుగ్గగుడెసుందీ మ‍్మమ్మమ మంచముందీ'' అనే పాట పాడిన తరువాత చానళ్ళాపాటు ఆవిడ భాధపడ్డారట.

మరిన్ని వార్తలు