అత్తకు ప్రశంసలు.. అల్లుడి ఆనందం

5 Dec, 2020 15:53 IST|Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన యాక్షన్‌ డ్రామా ‘టెనెట్’‌ శుక్రవారం(డిసెబంర్‌ 4) భారత్‌లో విడుదలైంది. జూన్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి డింపుల్‌ కపాడియా కీలక పాత్రలో నటించారు. ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో డైరెక్టర్‌ క్రిస్టఫర్‌ నంచి డింపుడ్‌ కపాడియా ఓ లెటర్‌ అందుకున్నారు. సినిమాలో ముఖ్య పాత్ర పోషించింనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలో రాశారు. చదవండి: యూపీ సీఎంతో అక్షయ్‌  భేటీ

ఈ లెటర్‌ను బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. అల్లుడిగా గర్వించే క్షణం అంటూ ఉప్పొం​గిపోయారు.‘ క్రిస్టోఫర్‌ నోలస్‌ నుంచి డింపుల్‌ కపాడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ వచ్చింది. నేను ఆమె స్థానంలో ఉంటే ఆశ్యర్చంతో ఉండిపోయేవాడిని. టెనెట్‌లో ఆమె నటన చూసి సంతోషంగా అనిపించింది. ఆమె అల్లుడిగా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను’. అని ట్వీట్‌ చేశారు. కాగా డింపుల్ క‌పాడియా కూతురు ట్వింకిల్ ఖ‌న్నాని అక్ష‌య్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా