‘పక్కా కమర్షియల్‌’..పోస్టర్‌ రిలీజ్‌ 

12 Jun, 2021 01:22 IST|Sakshi
గోపీచంద్‌

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. ఈ చిత్రంలోని స్టైలిష్‌ పోస్టర్‌ను గోపీచంద్‌ బర్త్‌డే (జూన్‌ 12) సందర్భంగా విడుదల చేశారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్‌ పతాకాలపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ నలభై శాతం పూర్తయింది. కొత్త షెడ్యూల్‌ను వచ్చే నెల మొదటివారంలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: జేకేఎస్‌ బిజాయ్, సహనిర్మాత: ఎస్‌కేఎన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు