PuneethRajkumar: పునీత్‌ పెళ్లికి 22 ఏళ్లు..

2 Dec, 2021 06:59 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: నెల కిందట ఆకస్మికంగా కన్నుమూసిన ప్రముఖ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు వివాహమై 22 ఏళ్లు పూర్తయింది. 1999 డిసెంబరు 1వ తేదీన అశ్వినిని పునీత్‌ ప్రేమించి పెళ్లాడారు. ఎన్నో ఆశలతో ఇద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ విధి మరోలా తలచడంతో 22వ వివాహ వార్షికోత్సవానికి పునీత్‌ లేరు.  

అల్లు శిరీష్‌ పరామర్శ 
పునీత్‌ అకాల మరణం శాండల్‌వుడ్‌కు తీరని లోటు అని తెలుగు నటుడు అల్లు శిరీష్‌ అన్నారు. బుధవారం ఆయన బెంగళూరులో పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ పునీత్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది, బెంగళూరుకు ఎప్పుడు వచ్చినా పునీత్‌ను కలిసేవాడినని అన్నారు.  

చదవండి: (పునీత్‌ మరణం ఒక ప్రశ్న: సోదరుడు రాఘవేంద్ర)

మరిన్ని వార్తలు