Puneeth Rajkumar: కర్ణాటకలో హైఅలర్ట్‌.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం

29 Oct, 2021 14:35 IST|Sakshi

Karnataka Issues High Alert : కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూశారు. జిమ్‌ చేస్తుండగా గురువారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పునీత్‌ తుదిశ్వాస విడిచారు. అయితే పునీత్‌ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసం‍ద్రంలో మునిగిపోయారు.

భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాండల్‌వుడ్‌ సినీ ప్రముఖులు విక్రమ్‌ ఆసుపత్రికి చేరుకుని పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతికి సంతాప సూచకంగా సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని వార్తలు