Puneeth Rajkumar: జిమ్‌లో గంటలకొద్దీ వర్కవుట్స్‌...వీడియోలు వైరల్‌

29 Oct, 2021 16:22 IST|Sakshi

RIP Puneeth Rajkumar: శాండల్‌వుడ్‌ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. జిమ్‌ చేస్తుండగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్‌ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి పునీత్‌ తుదిశ్వాస విడిచారు. చదవండి: శోక సంద్రంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు... వారి భయమే నిజమైంది

ఎంతో భవిష్యత్తు ఉండి, చిన్న వయసులోనే పునీత్‌ గుండెపోటుతో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్‌ మరణంతో శాండల్‌వుడ్‌తో పాటు భారత సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా పునీత్‌కు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై మక్కువ ఎక్కువ. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నిత్యం వ్యాయామం చేశేవారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకునేవారు. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా కనిపించే పునీత్‌ తీవ్ర గుండెపోటుతో చనిపోవడాన్ని అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఈ వార్త విని తమ గుండె పగిలిపోయిందని, ప్లీజ్‌ కం బ్యాక్‌ అప్పూ అంటూ ఫ్యాన్స్‌ భావేద్వేగంతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

చదవండి: కర్ణాటకలో హైఅలర్ట్‌.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం
Puneeth Rajkumar Death: పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు

A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official)

A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official)

A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official)

మరిన్ని వార్తలు