Puneeth Rajkumar: 50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు

3 Nov, 2021 08:06 IST|Sakshi

బెంగళూరు: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య పాల్గొన్నారు.  


 
తమిళ నటుడు పరామర్శ: తమిళ నటుడు శివ కార్తికేయన్‌ మంగళవారం బెంగళూరు నాగవారలోని శివరాజ్‌కుమార్‌ నివాసానికి వెళ్లారు.  భార్య, కూతుర్లను పరామర్శించి, కంఠీవర స్టూడియోకు వెళ్లి సమాధికి పూజలు చేశారు.   

నేటి నుంచి పునీత్‌ సమాధి దర్శనాలు 
బనశంకరి: బుధవారం నుంచి పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మంగళవారం పునీత్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు పాల పూజల అనంతరం పునీత్‌ అన్న శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ... అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను అనుమతి ఇస్తామని తెలిపారు.

చదవండి: (పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున)

మరిన్ని వార్తలు