Puneeth Rajkumar: గుండెపోటుతో ఇద్దరు అభిమానుల మృతి!

30 Oct, 2021 14:27 IST|Sakshi

Puneeth Rajkumar Fan Dies by Suicide: పునీత్‌ రాజ్‌కుమార్‌ విషాదం చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. అతి తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగిన పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం విస్మయానికి గురిచేస్తుంది. పునీత్‌ మరణంతో ఫ్యాన్స్‌ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తమ అభిమాన హీరో ఇక లేరన్న విషయం తెలిసి పునీత్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ అభిమాని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బెళగావి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పునీత్‌ మరణవార్త విని ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయినట్లు సమాచారం. 

పునీత్‌ మరణవార్త విని ఓ అభిమాని గుండెపోటుతో మరణించారు. కర్ణాటకకు చెందిన మునియ‌ప్ప‌న్ అనే 30 ఏళ్ల వ్యక్తి పునీత్‌ మరణవార్త విని కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

ఉడిపి జిల్లా సాలిగగ్రామానికి చెందిన మరో అభిమాని సతీష్‌(35)సైతం పునీత్‌ మరణవార్త విని గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.పునీత్‌ మరణవార్తకు సంబంధించి టీవీలో దృశ్యాలు చూసి నిరంతరంగా ఏడుస్తూనే ఉన్నాడట. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు