సౌత్‌ ఇండియాలోనే ఏ హీరోకి లేని సక్సెస్‌ గ్రాఫ్‌ పునీత్‌ సొంతం

2 Nov, 2021 01:18 IST|Sakshi

బెంగళూరు: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు సౌత్‌ ఇండియాలోనే ఏ సినిమా హీరోకి లేని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఆయన నటించిన 29 చిత్రాలలో అత్యదికం హిట్లు, సూపర్‌ హిట్లు, బ్లాక్‌బస్టర్‌లే అత్యధికం. పునీత్‌ రాజ్‌కుమార్‌ కెరీర్‌లో కెవలం 4 సినిమాలు మాత్రమే నిరాశను కలిగించాయి. ఇలా పునీత్‌ రాజ్‌కుమార్‌ కెరీర్‌ ఆరంభంలో వరుసగా 11 చిత్రాలు సూపర్‌ హిట్లు, బ్లాక్‌బస్టర్‌లే కావడం విశేషం.

ఆ రికార్డ్స్‌ సౌత్‌ ఇండియాలో ఏ ఇతర హీరోకు లేదనే చెప్పాలి. అయితే ఆయన విజయంలో మన తెలుగు వాళ్ళ పాత్రే ఎక్కువ. పునీత్‌ మొదని సినిమా నుంచి పవర్‌ స్టార్‌ బిరుదు వరకు తెలుగు సినిమా దర్శకులు, రచయితల పాత్ర ఉండటం విశేషం. తన తండ్రి స్వర్గీయ రాజ్‌కుమార్‌ కోరిక మేరకు మొదటి సినిమా పూరీ జగన్నాద్‌ దర్శకత్వంలో నటించాడు. పూరీ దర్శకత్వంలో 'అప్పు' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు పునీత్‌.

ఆ సినిమా రవితేజ హీరోగా నటించిన ఇడియట్‌ సినిమాకు మాత్రుక కావడం గమనార్హం. మొత్తంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన 29 చిత్రాలలో 6 బ్లాక్‌బస్టర్‌ హిట్లు కాగా 15 సూపర్‌ హిట్లు, అలాగే 5 సినిమాలు ఏవరేజ్‌ గానూ కెవలం 4 సినిమాలు మాత్రమే ప్లాప్‌గా నిలిచాయి. ఇలా తన కెరీర్‌లో 87% సక్సెస్‌ గ్రాఫ్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ సొంతం. తన నటన, డ్యాన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను  ఉర్రూతలూగించిన కన్నడ పవర్‌ స్టార్‌ ఇప్పుడు తమ మద్య లేక పోవడంతో తన అభిమానులతో పాటు యావత్‌ సినీ లోకం శోక సంద్రంలో మునిగి పోయింది.

మరిన్ని వార్తలు