పంచ్‌ డైలాగ్స్‌తో దుమ్ము రేపుతున్న ‘యువరత్న’ టీజర్‌

20 Mar, 2021 16:38 IST|Sakshi

‘ఫస్ట్‌బెంచ్‌లో అయితే బోర్డే.. అదే లాస్ట్‌ బెంచ్‌ అయితే వరల్డ్‌ మొత్తం కనిపిస్తుంది’

ఇప్పటికే 2 లక్షలు దాటేసిన వ్యూస్‌

సాక్షి, హైదరాబాద్‌ : కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ 'యువరత్న' సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ శనివారం విడుదల చేసింది.  సాయేషా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యాసంస్థలోని అవకతవకలను వేలెత్తి చూపడంతో పాటు కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అవుతోన్న తీరును చూపించడం గమనార్హం. ఎడ్యుకేషన్‌ ఈజ్‌ నాట్‌ ఏ బిజినెస్‌ ఇట్స్‌ఏ సర్వీస్‌.. ‌అంటూ  విద్య ప్రయివేటీకరణ మీద ప్రకాశ్‌ రాజ్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు, పునీత్‌ పంచ్‌ డైలాగులు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇందులో పోలీసు అధికారి సజ్జనార్‌ ప్రస్తావన కూడా ఉండటం విశేషం.

పోలీస్ ఆఫీసర్‌గా, మరోవైపు గడ్డంతో మరో లుక్‌తోనూ ఈ ట్రైలర్‌లో కనిపిస్తు‍న్నాడు పునీత్‌. అలాగే ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది. సంతోష్ అనంద్‌రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సోను గౌడ‌, ధనంజయ్‌ ప్రకాశ్‌రాజ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే 2 లక్షల, 42 వేలకు పైగా వ్యూస్‌, 3277లకు పైగా కమెంట్లతో దూసుకుపోతోంది. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా బాగానే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు