Liger Movie: థియేటర్‌ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ

26 Aug, 2022 14:35 IST|Sakshi
అభిమానుల మధ్య పూరీ సోదరుడు ఎమ్మెల్యే గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర  

నర్సీపట్నం: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన లైగర్‌ సినిమా రిలీజ్‌ కావడంతో నర్సీపట్నంలో అభిమానుల సందడి నెలకొంది. రాజు థియేటర్‌ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. పూరీ జగన్నాథ్‌ సోదరుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, మిగతా కుటుంబ సభ్యులతో రాజు థియేటర్‌లో సినిమాను తిలకించారు.  అభిమానులు భారీ ఎత్తున బాణసంచా పేల్చారు.  

సినిమా తిలకించిన అనంతరం థియేటర్‌ ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఎమ్మెల్యే గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, ఎమ్మెల్యే సతీమణి కళావతి కట్‌ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందనడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

చదవండి: (గణేష్‌ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి)

మరిన్ని వార్తలు