Puri Jagannadh: ‘లైగర్‌’ ఎఫెక్ట్‌.. రెంట్‌ కట్టలేక ఆ ఫ్లాట్‌ ఖాళీ చేసినపూరి జగన్నాథ్?

8 Sep, 2022 13:45 IST|Sakshi

లైగర్‌ ఫ్లాప్‌తో మరోసారి పూరి జగన్నాథ్‌ కష్టాల్లో పడ్డాడని తెలుస్తోంది. మాస్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న పూరి ఆ మధ్యలో వరుస ఫ్లాపులతో అ‍ప్పుల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో తిరిగి తన కెరీర్‌ను గాడిన పెట్టుకున్నాడు. అదే జోష్‌తో లైగర్‌ చిత్రాన్ని అంత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఆశపడ్డ మూవీ టీం అంచనాలన్ని తలకిందులయ్యాయి. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్‌ భారీ నష్టాలను మిగిల్చింది.

చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్‌? వరుడు ఎవరంటే..

దీంతో బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఈ చిత్ర నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ఇక మూవీని కరణ్‌ జోహార్‌తో కలిసి పూరీ, చార్మీలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు లైగర్‌ చిత్రీకరణ అంతా ముంబైలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఓ విలసవంతమైన ప్లాట్‌ను తీసుకున్న పూరి ఇప్పుడు రెంట్‌ కట్టలేక దాన్ని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్‌, ప్రమోషన్స్‌లో భాగంగా గతేడాది పూరీ ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబైలో ఓ విలాసవంతమైన సీ ఫేసింగ్‌ 4 బిహెచ్‌కే ఫ్లాట్‌ను రూ. 10 లక్షలకు అద్దెకు తీసుకున్నాడట. మెయింటనెన్స్‌ ఖర్చులు కలుపుకుని దాదాపు రూ. 15 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం.

చదవండి: రణ్‌బిర్‌-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత

ఇక లైగర్‌ డిజాస్టర్‌తో ఇప్పుడు ఆ రెంట్‌ కట్టేలేని పరిస్థితులో పూరి ఉన్నాడని, అందువల్లే ఈ ఫ్లాట్‌ను ఖాళీ చేశాడని తెలుస్తోంది. అదే లైగర్‌ హిట్‌ అయ్యి ఉంటే పూరి రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయేది. ఆశించినట్లు ఈ మూవీ విజయం సాధించి ఉంటే ఆయన కోసం బాలీవుడ్‌ అగ్ర హీరోలు, నిర్మాతలు క్యూ కట్టి ఉండేవారు. పూరి కూడా ఈ ఉద్దేశంతోనే ముంబైకి మకాం మార్చాడని సన్నిహితుల నుంచి సమాచారం. లైగర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని, అదే జరిగితే ఇక తాను ముంబైలోనే సెటిల్‌ అవ్యొచ్చనే ఉద్దేశంతో వెతికి మరి పూరి ఆ విలాసవంతమైన ఫ్లాట్‌ను ఎంతో ఇష్టంగా తీసుకున్నాడట. దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్‌ చిత్రం తొలి షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు లైగర్‌ రూ. 58 నుంచి 60 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు