Puri Jagnnadh: లైగర్‌ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే

14 Oct, 2022 16:35 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్‌. పాన్‌ ఇండియా మూవీగా రూపొందిన లైగర్‌ భారీ అంచనాల మధ్య ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్‌ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.

చదవండి: ‘బాహుబలి’ ఆఫర్‌ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి

మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లైవ్‌లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్‌ ఫ్లాప్‌పై స్పందించాడు. కాగా గాడ్‌ ఫాదర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌-చిరంజీవి ఇన్‌స్ట్రాగ్రామ్‌ లైవ్‌ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్‌ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్‌ టైమ్‌ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్‌ టైమ్‌ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు.

చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్‌ చేశాను. మంచి సెట్స్‌ వేశాం. కాస్ట్ అండ్‌ క్రూ, మైక్‌ టైసన్‌ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్‌ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్‌ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్‌కు వెళ్లి 100 స్క్వాడ్స్‌ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్‌ ఫాదర్‌లో పూరీ జర్నలిస్ట్‌గా కీ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు