టార్గెట్‌ ఫిక్స్‌ 

14 Jan, 2024 01:12 IST|Sakshi

టార్గెట్‌ ఫిక్స్‌ చేశాడు పుష్పరాజ్‌. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప:  రైజ్‌’ ఘనవిజయం సాధించడంతో, మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్‌. యాభై శాతానికి పైగా సినిమా పూర్తయింది.

బ్యాలెన్స్‌ షూటింగ్‌ను మే నెలాఖరుకల్లా పూర్తి చేసేలా టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుని, అందుకు అనుగుణంగా  సుకుమార్‌ షూటింగ్‌ ప్లాన్‌ సిద్ధం చేశారని సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్, ఎడిటింగ్‌ వర్క్స్‌పై మరింత ఫోకస్‌ పెట్టాలని సుకుమార్‌ భావిస్తున్నారట. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్‌ పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్‌కు జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఫాహద్‌ ఫాజిల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. 

>
మరిన్ని వార్తలు