Pushpa 2 The Rule Release Date: పుష్ప-2 రిలీజ్‌ తేదీపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

26 Jan, 2024 19:12 IST|Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'పుష్ప: ది రూల్‌'. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ పుష్ప పార్ట్‌ 2 కోసం ఎదురుచూస్తున్నారు. 2024 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టు కావడంతో అనుకున్న సమయంలో సినిమా విడుదల కాకపోవచ్చనే వార్త ప్రచారం జరిగింది.

కొద్దిరోజుల నుంచి పుష్ప వాయిదా అంటూ జరుగుతున్న వార్తలపై చిత్ర యూనిట్‌ రియాక్ట్‌ అయింది. ముందుగా ప్రకటించిన తేదీలోనే అంటే..  2024 ఆగస్టు 15న పుష్ప గాడు థీయేటర్‌లో కనిపిస్తాడని ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉ‍న్నారు. 

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్‌'2021లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. ఇందులో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇందులో  ఫహద్ ఫాజిల్ కొద్దిసేపు మాత్రమే కనిపించారు. పార్ట్‌-2లో ఆయన ఎక్కువ సేపు కనిపిస్తారని టాక్‌ ఉంది. పార్ట్‌-1కు వచ్చిన ఆధరణ చూసిన మేకర్స్‌ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్‌ 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

whatsapp channel

మరిన్ని వార్తలు