Pushpa Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'పుష్ప' కలెక్షన్స్‌

23 Dec, 2021 13:48 IST|Sakshi

Pushpa 6 Days Total Box Office Collections: అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదేలే అంటూ దుమ్మురేపుతుంది. డిసెంబర్‌17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు నుంచి కలక్షన్ల సునామీ కురిపిస్తున్న పుష్ప ఆరో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఆరవ రోజు రూ.3.36కోట్ల షేర్‌ను రాబట్టింది.

తొలిరోజే  71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ఇప్పటివరకు అన్ని వెర్షన్లు కలుపుకొని రూ.145.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు సమాచారం. క్రిస్మస్‌ పండగను కూడా పురస్కరించుకొని మరిన్ని లాభాలు తెచ్చిపెడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం. కాగా ఫిబ్రవరిలో ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

మరిన్ని వార్తలు