ముంబైలో ఫ్లాట్‌ కొన్న రష్మిక!

24 Feb, 2021 11:49 IST|Sakshi

ఛలో సినిమా హిట్‌ తర్వాత ఏ భాషైనా, ఏ సినిమా అయినా ఆగేది లేదంటూ యమ స్పీడుగా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా. తెలుగు, కన్నడ భాషలను సమానంగా బ్యాలెన్స్‌ చేస్తున్న ఈ క్యూటీ ఈ మధ్యే మిషన్‌ మజ్నుతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. క్షణం తీరిక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. దీంతో మొన్నామధ్య లగ్జరీ కారు కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు ఓ ఇల్లు కూడా కొందట.

హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను'తో పాటు అమితాబ్‌ బచ్చన్‌ తో ‘డాడీ’ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ రెండు చిత్రాల తర్వాత మరిన్ని హిందీ సినిమాలు చేసేందుకు కూడా రష్మిక ప్లాన్‌ చేసుకుంటోందని భావిస్తున్నారు అభిమానులు. ఎలాగో పాన్‌ ఇండియా సినిమాల్లో వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నందున రష్మిక ముంబైలో సెటిలవ్వాలనుకుంటోందా? ఏంటని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ముంబైలో ఆమె నిజంగానే కొత్త ఇల్లు కొనుక్కుందా? లేదా? అనేది క్లారిటీ రావాలంటే రష్మిక దీనిపై స్పందించాల్సిందే. 

ప్రస్తుతం రష్మిక స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన 'పుష్ప'లో నటిస్తోంది. ఇందులో ఆమె చిత్తూరు యాసలో మాట్లాడే పల్లెటూరి యువతిలా కనిపించనుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. మరోవైపు 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శర్వానంద్‌తో జోడీ కడుతోంది. అలాగే మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

చదవండి: ఆ వార్తలు నిజమైతే బాగుండు.. అదే నా కల: రష్మిక

బిజీ బిజీగా మన స్టార్‌ హీరోయిన్లు..

మరిన్ని వార్తలు