Sukumar : సమంత స్పెషల్‌ సాంగ్‌ సీక్రెట్స్‌ రివీల్‌ చేసిన సుకుమార్‌

19 Dec, 2021 11:17 IST|Sakshi

అందుకే సమంత ఐటెం సాంగ్‌కి ఒప్పుకుంది: సుకుమార్‌

Pushpa Director Sukumar Reveals Secrets About Samantha Item Song: అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీ అద్భుతమైన వసూళ్లతో దుమ్మురేపుతుంది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా'.. అనే పాట ఈ చిత్రానికే స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రంలోని లిరిక్స్‌పై వివాదం చెలరేగినా, అదే స్థాయిలో సూపర్‌ హిట్టయ్యింది. సమంత ఐటెం సాంగ్‌ చేస్తుందనగానే ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటివరకు విభిన్న పాత్రలతో స్టార్‌ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత అసలు ఐటెం సాంగ్‌ చేయడానికి ఎలా ఒప్పుకుంది అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్‌ సుకుమార్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొదట స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి సమంత ఒప్పుకోలేదు. అలాంటి పాటలు నాకు కరెక్ట్‌ కాదేమో అని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నేనే తనని కన్విన్స్‌ చేశాను.

ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌ కూడా స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తున్నారు..కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పా. ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇదో కొత్త అనుభవం..నటిగా ఓ సరికొత్త సమంతను చూస్తారు అని చెప్పా. నా మాట మీద నమ్మకంతో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి అంగీకరించింది అని సుకుమార్‌ వెల్లడించారు. 


 

మరిన్ని వార్తలు