ఎక్కడా తగ్గేదే లే.. ‘రాధేశ్యామ్‌’ను వెనక్కి నెట్టి టాప్‌లో ‘పుష్ప’

27 Jun, 2021 21:01 IST|Sakshi

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే ఈ సినిమాకి క్రేజ్‌ మామూలుగా లేదు. తగ్గేదే లే అని బన్నీ చెప్పిన ఊర మాస్‌ డైలాగ్‌తో పాటు ట్రైలర్‌ ఓ రేంజ్‌లో ఉండడం, పైగా బన్నీకిది ఫస్ట్‌ పాన్ ఇండియన్ మూవీ కావడంతో దీనిపై ప్రేక్షకుల అంచనాలు కూడా ఎక్కడా తగ్గట్టేదు. అంత క్రేజ్‌ ఉంది కాబట్టే ఈ సినిమా జాతీయ స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీ వరకు వెళ్ళి టాప్‌ ప్లేస్ కొట్టేసింది.  


ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాలకు పాన్‌ ఇండియా రేంజ్‌ వచ్చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాల విడుదల కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఎక్కువ మంది ఎదురుచూస్తున్న భారతీయ సినిమా జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఒకటి బన్నీ‘పుష్ప’ కాగా మరొకటి ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ ఇందులో చోటు దక్కించుకున్నాయి. కాగా  బాహాబలితో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్‌, ఫ్యాన్స్‌ను సంపాదించిన ప్రభాస్‌ సినిమా కంటే బన్నీ పుష్ప టాప్‌లో ఉండడం గమనార్హం.  ఈ జాబితాలో ‘ రాధేశ్యామ్‌ ’ మూడో స్థానంలో ఉంది.

చదవండి: Rajinikanth: సూపర్‌ స్టార్‌ యూఎస్‌ ఫోటోలు లీక్‌..లోకల్‌ ట్రైన్‌లో అలా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు