Pushpa Keshava Actor: చిత్తూరు యాసలో ఇరగదీశాడు.. అసలు ఎవరీ కేశవ?

20 Dec, 2021 16:55 IST|Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్‌ అవైటడ్‌ మూవీగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప: ది రైజ్‌’. సుకుమార్‌ టేకింగ్‌, బన్నీ యాక్టింగ్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవడంతో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో కొత్త రికార్డు సాధించడం చూసి సినీ పండితులు కూడా షాక్‌కు గురవుతున్నారు. కరోనా తరువాత ఈ రేంజ్‌లో బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో నటన పరంగా చెప్పుకోదగిన మరో విషయం ఏంటంటే బన్నీ పక్కన కేశవ పాత్రలో చేసిన జగదీష్ ప్రతాప్ బండారి గురించే.

ఇంత వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న జగదీష్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సఫలమయ్యాడనే చెప్పాలి.  పుష్ప లాంటి భారీ బడ్జెట్‌ సినిమాలో హీరో పక్కన నటించే పాత్రల కోసం డైరెక్టర్‌ కొత్త నటులను తీసుకుని రిస్క్‌ తీసుకోరు. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టిన అది సినిమాపై ‍ప్రభావం చూపిస్తుంది. అందుకు అలాంటి పాత్రలకోసం దర్శకులు ఇండస్ట్రీలో పేరున్న నటులను ఎంపిక చేసుకుంటారు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం పేరు కంటే ప్రతిభ ఉన్నవాళ్లకు తన సినిమాలలో అవకాశాలను ఇచ్చారు.

కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి సినిమాలను చూస్తే.. అతను పలాస 1978, మల్లేశం సినిమాలలో నటించాడు. అది కూడా చిన్న పాత్ర మాత్రమే. అయినా అతను చేసిన ప్రాత పరిధిని కాకుండా తన నటన గుర్తించాడు సుకుమార్‌. సీమ యాసలో బాగా మాట్లాడే ఈ నటుడికి అదే యాసలో మాట్లాడే పాత్రను సుకుమార్ ఇవ్వడంతో పాత్ర న్యాయం చేశాడని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప సినిమాకు నెరేషన్ ఇచ్చింది కూడా ప్రతాప్ బండారి కావడం గమనార్హం. పుష్ప సక్సెస్ తో ప్రతాప్ బండారి పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ పేరుతో భవిష్యత్తులో మరిన్నీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

చదవండి: Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్‌ సాంగ్‌ ట్రోల్స్‌పై స్పందించిన సామ్‌

మరిన్ని వార్తలు