బన్నీ ఖాతాలో మరో అరుదైన ఘనత.. అది ‘పుష్ప’కే సొంతం

9 Apr, 2021 14:38 IST|Sakshi

అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్‌ బర్త్‌డే(ఏప్రిల్‌ 8) సందర్భంగా ‘పుష్పరాజ్‌ను పరిచయం చేస్తూ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. తాజాగా ఈ వీడియో ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు పుష్ప టీజర్‌ 30 మిలియన్ల వ్యూస్‌, 9 లక్షలకు పైగా లైకులు సంపాదించింది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఓ ప్రత్యేకమైన పోస్ట్‌ర్‌ ద్వారా వెల్లడించింది. అతి తక్కువ సమయంలో పుష్ప టీజర్‌కి 30 మిలియన్ల వ్యూస్‌ రావడం పట్ల బన్నీ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఖాతాలో మరో రికార్డు అంటూ టీజర్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కాగా, పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు