Pushpa Movie : పుష్ప మేకింగ్‌ వీడియో.. అలరిస్తున్న తెర వెనుక సన్నివేశాలు

26 Dec, 2021 19:43 IST|Sakshi

Pushpa Movie New Making Video Released: ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌'.     రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. డిసెంబర్‌ 17న విడుదలైన 'పుష్ప' సినిమా విశేష ప్రేక్షాదరణ పొందుతోంది. కాగా, ఈ సినిమా మేకింగ్‌ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా ఆదివారం (డిసెంబర్ 17) విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో పాటలు, యాక్షన్‌ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో చూపించారు. అడవిలో సెట్లు ఎలా వేశారు ? నటులు, దర్శకుడి మధ్య సంభాషణలు ఎలా ఉన్నాయి ? అనేవి వీడియోలో చూడొచ్చు. 

అలాగే ఈ సినిమా చిత్రీకరణను చూసేందుకు డైరెక్టర్ వీవీ వినాయక్‌ వచ్చారు. బన్నీ,  సుకుమార్‌తో వినాయక్‌ మాట్లాడే సన్నివేశాన్ని మనం చూడొచ్చు. అల్లు అర్జున్‌ కుమార్తె అర్హను బన్నీ సరదాగా ఎత్తుకుని సెట్‌ చూపించడం ఆకట్టుకుంది. మంచం నవారును సరిచేస్తూ సుకుమార్ కనిపిస్తాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా రెండో భాగం 'పుష్ప: ది రూల్‌' షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 

ఇదీ చదవండి:  'పుష్ప' ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు..

మరిన్ని వార్తలు