Pushpa Movie: 'పుష్ప' ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు..

21 Dec, 2021 07:46 IST|Sakshi

Pushpa Movie Producers Press Meet On Movie Success: ‘‘పుష్ప: ది రైజ్’ సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉండేది.. కానీ ఇంత పెద్ద హిట్‌ సాధిస్తుందని ఊహించలేదు. బ్లాక్‌ బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్, రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు రూ. 173 కోట్ల గ్రాస్, రూ. 85 కోట్ల షేర్‌ సాధించింది’’ అని తెలిపారు. ‘‘పుష్ప’ విడుదల తర్వాత ఇక్కడ హాలీవుడ్‌ మూవీ ‘స్పైడర్‌ మ్యాన్‌’కి థియేటర్స్‌ తగ్గాయంటే మా సినిమా క్రేజ్‌ ఏంటో తెలుస్తోంది’’ అన్నారు సీఈఓ చెర్రీ. ‘‘పుష్ప’లో భాగం కావడం గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామ్యాన్‌ మిరోస్లా క్యూబా. 

'పుష‍్ప' సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 173 కోట్ల వసూళ్లు సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్‌ చేసింది. ఆదివారం (డిసెంబర్‌ 19) భారీ కలెక్షన్లతో దుమ్ములేపిన పుష్పరాజ్‌ 2021 సంవత్సరంలో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచాడు. పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేసింది 'పుష‍్ప'. ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ 'పుష్ప: ది రూల్‌' షూటింగ్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 

ఇదీ చదవండి: 2021లో దేశంలోనే బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా 'పుష్ప'.. 3 రోజుల్లోనే..


 

మరిన్ని వార్తలు