Pushpa Movie Third Single: నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే..

25 Oct, 2021 17:08 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక మందన్నా. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే  పుష్ప నుంచి విడుదల ఫస్ట్‌ సింగిల్‌, సెకండ్‌ సింగ్‌ల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి మరో థర్డ్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌.

‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట ప్రోమోను విడుదల చేస్తూ అక్టోబర్‌ 28న ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రోమో సాంగ్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదల చేశారు. కాగా ఇప్పటికే విడదులైన ఫస్ట్‌ సింగిల్‌ దాక్కో దక్కో మేక, శ్రీవల్లిగా రష్మికపై చిత్రీకరించిన  ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ పాటకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు