బన్నీకి కరోనా.. రెండు రోజులు ఆగితే అది పూర్తయ్యేది

30 Apr, 2021 05:25 IST|Sakshi

పుష్పరాజ్‌ ప్లాన్‌ను కరోనా అడ్డుకుంది. పుష్పరాజ్‌ యాక్షన్‌కు బ్రేక్‌ వేసింది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలో బన్నీ (అల్లు అర్జున్‌) పుష్పరాజ్‌ పాత్రలో కనిపిస్తారు. అయితే అల్లు అర్జున్‌కు కరోనా సోకడం వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ జస్ట్‌ రెండంటే రెండు రోజులు బన్నీ షూట్‌లో పాల్గొన్నట్లయితే తను చేయాల్సిన యాక్షన్‌ సీక్వెన్స్‌ పూర్తయ్యేదట. మరోవైపు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న మలయాళ నటుడు షాహద్‌ ఫాజల్, అనసూయలపై ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తీయాల్సింది. ఇప్పుడు దీనికి కూడా బ్రేక్‌ పడింది. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు