ఆన్‌లైన్‌లో లీకైన ‘పుష్ప’ స్టోరీ, సుక్కుపై ట్రోల్స్‌!

2 May, 2021 20:48 IST|Sakshi

ప్రస్తుతం టాలెంటెడ్​ డైరెక్టర్​ సూకుమార్-ఐకాన్‌​ స్టార్​ అల్లు అర్జున్​ పాన్​ ఇండియా చిత్రం ‘పుష్ప’కు సంబంధించిన ఓ వార్త నెట్టింటా హల్​చల్​ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో యాక్షన్​ సన్నివేశాల చిత్రకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడించింది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సుకుమార్‌ ఈ మూవీని రూపొందించాడు. ఇందులో స్టైలిష్​ స్టార్​ మాస్​ లుక్​లో కనిపించనున్నాడు. పుష్పరాజు అనే లారీ డైవర్​గా అలరించనున్నాడు.

ఇప్పటికే విడుదలై ఈ మూవీ ఫస్ట్​లుక్​ పోస్టర్​, టీజర్​కు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పే ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయతే తాజా బజ్​ ప్రకారం.. పుష్ప స్టోరీ ఆన్​లైన్​లో లీక్​ అయినట్లు వినపిస్తోంది. పుష్ప కథ ఇదే అంటూ సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అది చూసిన వారంత పుష్ప స్టోరీ కాపీ కొట్టిందని, మన టాలెంటెడ్​ దర్శకుడు​ సూకుమార్..​ లెజెండరీ డైరెక్టర్​ మణిరత్నం ‘విలన్’​ మూవీ కథను ఆధారంగా చేసుకుని ‘పుష్ప’ను రాసుకొచ్చారంటూ ఆయనపై తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు. 

అయితే రామాయణం కథను ఆధారంగా చేసుకొని.. రావణాసురుడి పాయింట్ ఆఫ్‌ వ్యూలో ‘విలన్’ సినిమాని రూపొందించారు మణిరత్నం. తన చెల్లికి జరిగిన అన్యాయంపై హీరో.. విలన్‌లపై ఏ విధంగా పగ తీర్చుకుంటాడనేదే ఈ సినిమా కథ. అయితే సుకుమార్ కూడా ఈ కథని బేస్ చేసుకొనే ‘పుష్ప’ మూవీని రూపొందించారని కామెంట్స్​ వస్తున్నాయి. అయితే ‘పుష్ప’ సినిమాలో కూడా అల్లు అర్జున్‌కు ఓ చెల్లి పాత్ర ఉంటుందనేది మేకర్స్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నట్లు సమాచారం.

దీంతో ఈ సినిమాలో కూడా పుష్పరాజ్ తన చెల్లికి అన్యాయం చేసిన వాళ్లపై రివేంజ్‌ తీర్చుకోవడమే ప్రధాన కథాంశంగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నిజంగానే సుకుమార్ ‘విలన్’ సినిమాని కాపీ కొట్టారా లేదా అనే విషయం తెలియాంటే ఈ మూవీ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ పాత్ర పోషిస్తున్నాడు‌. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది.

చదవండి:
రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా..
కన్నడ రీమేక్‌లో నితిన్‌ హిట్‌ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా!

మరిన్ని వార్తలు