Trolls On R Madhavan: సైలెంట్‌గా ఉండమన్న నెటిజన్లు.. అజ్ఞానిని అంటూ హీరో ట్వీట్‌..

26 Jun, 2022 15:42 IST|Sakshi

R Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar For Mars Mission: దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్, స్టార్‌ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే మాధవన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నాయి. 

ఓ ప్రెస్‌ మీట్‌లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్‌ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్‌ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్‌ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ కాగా నెటిజన్స్‌ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. 

(చదవండి: చై-సామ్‌ బాటలో మరో టాలీవుడ్‌ జంట ?)


'సైన్స్‌ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్‌ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది', 'మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?', 'ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్‌ స్పందించాడు. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్‌ అని అనడం నా తప్పే. ఈ విమర్శలకు నేను అర్హుడినే. నేను అజ్ఞానినే. ​‍అయితే ఈ మాటల వల్ల మనం కేవలం 2 ఇంజిన్‌ల సహాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనే నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్‌ ఇంజిన్‌ ఒక రాక్‌స్టార్‌.' అని ట్వీట్‌ మాధవన్‌ ట్వీట్‌ చేశాడు. 

(చదవండి: 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు)


(చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..)

మరిన్ని వార్తలు