‘రైతన్న’..వారి కష్టాలు కళ్లకు కట్టినట్లు..

12 Jul, 2021 01:48 IST|Sakshi
గద్దర్, శోభనాద్రీశ్వరరావు, నారాయణమూర్తి, గోరటి వెంకన్న

– ఆర్‌. నారాయణ మూర్తి

‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి. దేశానికి రైతే వెన్నెముఖ అంటారు. కానీ అన్నదాత ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? అనే కథాంశంతో ‘రైతన్న’ సినిమా తీశా. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావుగార్లు  పాటలు పాడారు.. వారికి నా నివాళులు’’ అని ఆర్‌. నారాయణ మూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకుల కోసం హైదరాబాద్‌లో ‘రైతన్న’ సినిమాని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభ నాద్రీశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి బాధలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాల వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో ‘రైతన్న’ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు నారాయణ మూర్తి. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను వెంటనే అమలు పరచాలి’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ నాయకులు కోదండ రెడ్డి, చాడ వెంకట్‌ రెడ్డి, మధు, శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి అందె శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, సాగర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు