R Narayanamurthy: కళాకారులకు పెన్షన్‌ ఇవ్వాలని పోరాడిన మహానటి జమున

27 Jan, 2023 15:24 IST|Sakshi

సీనియర్‌ నటి జమున శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. ఆమె మరణంపై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో జమున ఒక మహానటి. అగ్రహీరోలతో ఆమె నటించి మెప్పించారు. యావత్‌ భారతీయ సినీపరిశ్రమకు ఆమె మరణం తీరని లోటు. మూగమనసు సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమా మొత్తం ఆమెతోనే నడుస్తుంది.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ సహా ఎంతోమంది నటులతో ఆమె నటించారు. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్‌ స్టార్‌. కళాకారులకు పెన్షన్‌ ఇవ్వాలని తను ఎంతగానో పోరాడింది. ప్రభుత్వ లాంఛనాలతో జమున అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కేంద్రం ఆమెకు పద్మ అవార్డ్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా' అన్నారు నారాయణమూర్తి.

చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం
తెలుగు సినీ ఇండస్ట్రీ మహారాణి.. జమున మరణంపై సెలబ్రిటీల సంతాపం

మరిన్ని వార్తలు