వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్‌.నారాయణమూర్తి

2 Sep, 2021 10:11 IST|Sakshi

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌

రైతన్న సినిమా కోసం నాగార్జునసాగర్‌లో పర్యటన

సినిమాను ఆదరించాలని ఎమ్మెల్యే నోముల భగత్‌ పిలుపు

హాలియా : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అంతమొందించే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యతతో పోరాడాలని, రైతుల పోరాటానికి మద్దతుగా వారిని చైతన్య పరిచేందుకు రైతన్న సినిమాను తీసినట్లు సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి పేర్కొన్నారు. బుధవారం హాలియాలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కున్‌రెడ్డి నాగిరెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, కుర్ర శంకర్‌నాయక్, దుబ్బా రామచంద్రయ్య, జువాజీ వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, రవినాయక్, యూసూబ్, శ్రీను, యాదయ్య, యడవెల్లి శ్రీను, ఎస్‌కె జానీపాషా, రవి, రవీందర్‌ తదితరులు ఉన్నారు. (చదవండి: ఫైవ్‌స్టార్‌ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం)

‘రైతన్న’ను ఆదరించాలి: నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే భగత్‌
సమాజహితం కోసం ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి నిర్మించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ కోరారు. బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆర్‌ నారాయణమూర్తి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన వ్యవసాయ విద్యుత్‌ సంస్కరణలను పునర్‌ సమీక్షించాలన్నారు. ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడడంతో పాటు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతన్న సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వి«ధానాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో అనుముల, తిరుమలగిరి మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాగయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గౌరవసలహాదారు వెంపటి శంకరయ్య, వైస్‌ చైర్మన్‌ సుధాకర్, కౌన్సిలర్‌ వెంకటయ్య, నాయకులు చాపల సైదులు, సురభి రాంబాబు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, బందిలి సైదులు, రావుల లింగయ్య ఉన్నారు. 

చదవండి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

మరిన్ని వార్తలు