ఆ ఒక్క విషయం గురించి అడగొద్దంటూ వెళ్లిపోయిన రాశీ ఖన్నా

3 Apr, 2024 06:51 IST|Sakshi

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ చుట్టేసిన నటి రాశీ ఖన్నా, అయినప్పటికీ ఇంకా స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ కోసం పోరాడుతూనే ఉన్నారు. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్నట్లుగా ఆకర్షణీయమైన రూపం, కుర్రకారును ఆకట్టుకోవడానికి గ్లామరస్‌గా నటించడానికి వెనుకాడని తత్వం రాశీఖన్నాది. కారణం ఏమిటో కానీ అవకాశాలు ఆశించినంతగా రావడం లేదు.

మొన్నామధ్య తమిళంలో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తిరుచిట్రఫలం (తిరు) చిత్రంలో అలా మెరిసి ఇలా కనిపించకుండా పోయిన ఈమె చాలా గ్యాప్‌ తరువాత అరణ్మణై 4 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో మరో కథానాయకిగా నటించిన తమన్నతో పోటీ పడి మరీ అందాలను ఆరబోశారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలనుందని చెప్పారు.

బాహుబలి లాంటి చిత్రంలో నటి సత్తా చాటు కోవాలనే కోరిక ఉందన్నారు. అలాంటి మంచి ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అరణ్మణై 4 చిత్రంలోనూ మంచి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని రాశీఖన్నా వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉందిగానీ 33 ఏళ్ల ఈ భామ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా , ఆ ఒక్కటీ అడగొద్దు అంటూ నైస్‌గా ఎస్కేప్‌ అయ్యారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers